దుల్ఖర్ సల్మాన్ కు జతగా పూజ హెగ్డే

22-05-2020 Fri 08:56
  • తెలుగులో టాప్ పొజిషన్ లో వున్న పూజ 
  • ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ లతో చిత్రాలు
  • హను రాఘవపూడి దర్శకత్వంలో ఛాన్స్
Pooja Hegde opposite Dulkhar Salman in a Telugu movie

ప్రస్తుతం తెలుగులో టాప్ పొజిషన్ లో వున్న ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో పూజ హెగ్డే ముందుంటుంది. అందుకే ఆమెకు టాప్ హీరోల సినిమాల నుంచి మంచి డిమాండ్. దానికి తగ్గట్టుగానే అమ్మడు 'నెంబర్ వన్ హీరోయిన్' రేంజ్ లో పారితోషికాన్ని తీసుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ తో ఓ చిత్రం, అఖిల్ తో ఓ చిత్రం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో తెలుగు చిత్రాన్ని అంగీకరించింది.

మలయాళ యంగ్ హీరో దుల్ఖర్ సల్మాన్ సరసన ఓ తెలుగు సినిమాలో నటించడానికి పూజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే ఓ చిత్రంలో దుల్ఖర్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ పాత్రకు పూజాను ఎంచుకుని, ఆమెకు కథ చెప్పినట్టు, ఆమె ఓకే చెప్పినట్టు తాజా సమాచారం. లాక్ డౌన్ ముగిసి, షూటింగులు మొదలుకాగానే ఈ చిత్రం కూడా సెట్స్ కి వెళుతుంది.