ఈ గేమ్ లో నేను సూపర్... ఈ అబ్బాయితో మాత్రం గెలవలేకపోతున్నాను: నమ్రత శిరోద్కర్

21-05-2020 Thu 21:27
  • ఆసక్తికరమైన పోస్టు చేసిన నమ్రత
  • కనురెప్ప కదల్చకుండా చూడడంలో మహేశ్ బాబుతో పోటీ
  • మహేశ్ బాబే గెలిచాడని వెల్లడి
Namratha says that she can not win Mahesh Babu in Blink and you lose

లాక్ డౌన్ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటి నుంచి తరచుగా ఏదో ఒక పోస్టు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల తన కుమారుడు గౌతమ్ పై కనురెప్ప కదల్చకుండా చూడడంలో విజయం సాధించిన మహేశ్ బాబు తాజాగా తన అర్ధాంగి నమ్రతపైనా ఈ గేమ్ లో విన్నర్ అయ్యాడు. దీనిపై నమ్రత ఆసక్తికరంగా పోస్టు చేశారు. "మహేశ్ వర్సెస్ గౌతమ్ పోటీ ముగిసింది, ఇప్పుడు నా వంతు. కనురెప్ప కదిల్చితే ఓడిపోయినట్టే. అయితే మహేశ్ బాబే గెలిచాడు. ఈ గేమ్ లో నేను సూపర్, కానీ ఎందుకో ఈ అబ్బాయితో గెలవలేకపోతున్నా" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు.