తెలంగాణలో కరోనా ఉద్ధృతి... నేడు ఐదుగురి మృతి

21-05-2020 Thu 21:07
  • మొత్తం 45కి చేరిన మరణాలు
  • నేడు 38 కొత్త కేసులు నమోదు
  • 23 మంది డిశ్చార్జి
Five more died of corona in Telangana

గత కొన్నిరోజులుగా తెలంగాణలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే ఐదుగురు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 45కి పెరిగింది.

ఇక, కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 26 కేసులను జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించారు. మరో రెండు కేసులు రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూశాయి. మరో 10 మంది వలస కార్మికులకు కూడా కరోనా నిర్ధారణ అయింది. నేడు 23 మంది డిశ్చార్జి కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,036కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 618 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.