నా ప్రియమైన లాలెట్టన్ మోహన్ లాల్ అంటూ చిరంజీవి శుభాకాంక్షలు!

21-05-2020 Thu 21:00
  • నేడు మోహన్ లాల్ పుట్టినరోజు
  • మీ కాలంలో నేను కూడా ఉన్నందుకు గర్విస్తున్నానన్న చిరు
  • ప్రేక్షకులను ఇలాగే మైమరపించాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య
chiranjeevi wishes Mohanlal on his birthday

మలయాళ సినీ పరిశ్రమ మెగాస్టార్ మోహన్ లాల్ ఈరోజు 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ సెలబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ లాల్ తో ముందు నుంచి కూడా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన మిత్రుడికి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

'నా ప్రియమైన లాలెట్టన్ మోహన్ లాల్ కు 60వ జన్మదిన శుభాకాంక్షలు. మీలాంటి యాక్టింగ్ లెజెండ్, సూపర్ స్టార్ ఉన్న కాలంలోనే నేను కూడా సినీ పరిశ్రమలో ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నా. మీరు ఇలాగే ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను మైమరపించాలని, అందరిలో స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నా' అంటూ చిరంజీవి ట్వీట్  చేశారు. మోహల్ లాల్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.