యువతిపై అత్యాచారం.. బాలీవుడ్ నటి తండ్రిపై కేసు నమోదు!

21-05-2020 Thu 20:09
  • 20 ఏళ్ల యువతిని రేప్ చేసిన షెహనాజ్ గిల్ తండ్రి
  • మే 14న బియాస్ గ్రామం వద్ద అత్యాచారం
  • భయంతో ఫిర్యాదు చేయని బాధితురాలు
Rape case filed against actress Shehnaz Gill father

బాలీవుడ్ నటి, సింగర్, బిగ్ బాస్ 13 కంటెస్టెంట్, మోడల్ షెహనాజ్ గిల్ తండ్రి సంతోఖ్ సింగ్ రేప్ కేసులో ఇరుక్కున్నాడు. 20 ఏళ్ల అమ్మాయిని తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు. మే 14వ తేదీన ఈ దారుణం జరిగినప్పటికీ... ఫిర్యాదు చేసేందుకు బాధితురాలి కుటుంబం భయపడింది. అయితే ఓ వ్యక్తి చొరవ తీసుకోవడంతో బాధితురాలు ముందుకొచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.... మే 14న స్నేహితురాలితో కలసి మరో స్నేహితుడు సిద్ధూను కలవడానికి బాధితురాలు బియాస్ గ్రామానికి వెళ్లింది. సాయంత్రం 5.30 గంటలకు వారు బియాస్ కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సంతోఖ్ సింగ్ తుపాకీ గురిపెట్టి ఆమెను కారులోకి తోశాడు. చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేశారు. సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.