జూనియర్ ఎన్టీఆర్ పై సినీనటి పూనం కౌర్ పరోక్ష ట్వీట్

21-05-2020 Thu 19:46
  • చిన్నప్పటి నుంచి తిరస్కరణకు గురయ్యాడు
  • అతని ప్రయాణాన్ని ఎంతో గౌరవిస్తున్నా
  • తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి
Actess Poonam Kaur tweets on Junior NTR

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ నటి పూనం కౌర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. చిన్నప్పటి నుంచి తిరస్కరణకు గురయ్యాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

'ఎదుగుతున్న వయసులో అకారణంగా ప్రేమ నిరాదరణకు గురయ్యాడు.. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు.. అతని ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నా. స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్' అంటూ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పూనం కౌర్ పరోక్షంగా ట్వీట్ చేసింది. పూనం ట్వీట్ ను పలువురు ఎన్టీఆర్ అభిమానులు స్వాగతించారు. మీరు చెప్పింది కరెక్టేనని వ్యాఖ్యానిస్తున్నారు.