Aditya Music: కరోనా కష్టకాలంలో మ్యూజిక్ కంపోజర్లు, లిరిక్ రైటర్లకు అండగా ఆదిత్య మ్యూజిక్

  • కంపోజర్లు, లిరిక్ రైటర్ల హక్కుల కోసం కృషిచేస్తున్న ఐపీఆర్ఎస్
  • లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా రిలీఫ్ ఫండ్ అందజేత
  • తెలుగు కళాకారులకు ఫండ్ దక్కేందుకు 'ఆదిత్య' కృషి
Aditya Musio handy for music composers and lyric writers

భారతదేశ వ్యాప్తంగా ఉన్న సంగీత దర్శకులు, లిరిక్ రైటర్ల హక్కులను కాపాడేందుకు ఇండియా పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ (ఐపీఆర్ఎస్) అనే సంస్థ కొన్నాళ్లుగా కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ బోర్డులో ఆదిత్య మ్యూజిక్ కు కూడా సభ్యత్వం ఉంది. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో చిత్ర పరిశ్రమల కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనిపై ఆదిత్య మ్యూజిక్ సంస్థ డైరెక్టర్ ఆదిత్య గుప్తా స్పందించారు.

ఐపీఆర్ఎస్ బోర్డులో తమకు కూడా సభ్యత్వం ఉండడం పట్ల ఆనందంగా ఉందని, ఐపీఆర్ఎస్ లో ప్రాథమిక సభ్యత్వం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకు, లిరిక్ రైటర్లకు కరోనా సహాయ నిధి అందేలా కృషి చేశామని వెల్లడించారు. సంగీత దర్శకులు, పాటల రచయితలందరితో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, మున్ముందు కూడా సంగీత, సాహిత్య కళాకారులకు అండగా ఉంటూ, ఐపీఆర్ఎస్ ద్వారా తగిన సాయం అందించేందుకు ఆదిత్య మ్యూజిక్ పాటుపడుతుందని ఆదిత్య గుప్తా తెలిపారు. కాగా, ఐపీఆర్ఎస్ బోర్డులో దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆదిత్య మ్యూజిక్ కు మాత్రమే దక్కింది.

అటు, ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ తాజా పరిస్థితిపై స్పందిస్తూ కరోనా రిలీఫ్ ఫండ్ ను తెలుగు సంగీత కళాకారులకు అందేందుకు ఆదిత్య మ్యూజిక్ ఎంతో చిత్తశుద్ధితో పనిచేసిందని అన్నారు. ఎలాంటి విపత్తులు వచ్చినా ఆదిత్య మ్యూజిక్ తమకు అండగా నిలుస్తోందని తెలిపారు.

More Telugu News