Andhra Pradesh: ఇంగ్లీష్ మీడియంను అమలు చేయడంపై రాష్ట్ర వ్యాప్త సర్వే.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం

  • పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ మీడియం అమలు
  • విద్యా రంగంలోని సంస్కరణలపై షార్ట్ ఫిలింలు
  • సమగ్ర శిక్ష అభియాన్ కింద కార్యక్రమాలు
AP govt takes key decisions on english medium

పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలనే కృత నిశ్చయంతో వైసీపీ ప్రభుత్వం ఉంది. తాజాగా దీనికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్ మీడియంను అమలు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టాలని నిర్ణయించింది.

ఈ సర్వేను ఒక ప్రముఖ థర్డ్ పార్టీ సంస్థతో చేయించాలని భావిస్తోంది. దీనికి తోడు విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిలింలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను ఓ ఇంగ్లీష్ ఛానల్ కు అప్పగించింది. సమగ్ర శిక్ష అభియాన్ కింద సర్వే, షార్ట్ ఫిలిం కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.

More Telugu News