ప్రభాస్ కు జోడీగా అలియా భట్!

21-05-2020 Thu 14:56
  • హీరోయిన్ల ఎంపిక కోసం పెద్ద కసరత్తు
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చిత్రం
  • అలియాకు త్వరలో కథ చెప్పనున్న దర్శకుడు
  • ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్'లో నటిస్తున్న అలియా
Aliya Bhat to be cast opposite Prabhas

టాలీవుడ్ స్టార్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం అన్నది దర్శక నిర్మాతలకు మామూలు విషయం కాదు. ఇది చాలా పెద్ద వ్యవహారం. ఈ క్రమంలో పెద్ద కసరత్తు చేస్తారు. నచ్చిన వాళ్ల డేట్స్ ఏమో దొరకవు.. దొరికిన వాళ్లు పారితోషికం ఎక్కువ చెబుతుంటారు. అందుకే, హీరోయిన్ ఎంపిక అన్నది ఓ పట్టాన తెమలదు.

ఇక విషయానికి వస్తే, ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ భామ అలియా భట్ పేరు వినిపిస్తోంది. ఆమెను సంప్రదించినట్టు, ఈ ప్రాజక్టు చేయడానికి ఆమె సుముఖంగా వున్నట్టు సమాచారం.

లాక్ డౌన్ ముగియగానే దర్శకుడు నాగ్ అశ్విన్ ముంబై వెళ్లి అలియాకు కథ చెప్పనున్నట్టు తెలుస్తోంది. కాగా, అలియా ప్రస్తుతం తెలుగులో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే!