కరోనా వ్యాప్తి వేళ బామ్మను ఇలా కౌగిలించుకున్నాడు.. వీడియో వైరల్!

21-05-2020 Thu 13:09
  • బామ్మను కౌగిలించుకునేందుకు ఓ వ్యక్తి వినూత్న ప్రయోగం
  • లండన్‌లోని స్ట్రాట్ఫోర్డ్ లో ఘటన
  • ప్లాస్టిక్ కర్టెన్‌కు ఏర్పాటు చేసిన వ్యక్తి
man hugs

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలు అమలవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన బామ్మను కౌగిలించుకునేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయోగానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. లండన్‌లోని స్ట్రాట్ఫోర్డ్ కు చెందిన ఆంటోనీ కావిన్‌కు తన బామ్మను కౌగించుకోవడానికి ప్లాస్టిక్ కర్టెన్‌ ఏర్పాటు చేశాడు. దీనికి కడిల్ కర్టెన్ అనే పేరు కూడా పెట్టాడు.

చేతులకు పొడవాటి గ్లోవ్స్ వేసుకుని హత్తుకున్నాడు. కావిన్ భార్య మిరియం దీనిని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. 'కడిల్ కర్టెన్‌'కి ఓ వైపు నిల్చోగా, అతడి బామ్మ మరో వైపు నించుకున్నారు. అనంతరం కర్టెన్ మధ్యలో ఉండగా వారిద్దరు కౌగిలించుకున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 56 లక్షల మందికిపైగా చూశారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ వీడియోను షేర్ చేసి, ఈ కొత్త ఐడియాను మెచ్చుకున్నారు.