కండోమ్స్ తో తయారైన డ్రెస్ ధరించిన ఉపాసన.. మీకు దమ్ముందా? అంటూ సవాల్!

21-05-2020 Thu 12:50
  • స్క్రాప్ తో తయారైన దుస్తులు ధరించిన ఉపాసన
  • పర్యావరణహితమైన ఫ్యాషన్ దే భవిష్యత్తు అని వ్యాఖ్య
  • స్క్రాప్ ను మీరు ధరించగలరా అంటూ సవాల్
Upasana wears Condoms dress

హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన పలు రంగాల్లో ప్రతిభను చాటుతూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. పోషకాహారం, ఫిట్ నెట్, వంటలు, ఆరోగ్యం, సమాజసేవ ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి తన ఆలోచనలు సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. కరోనా నేపథ్యంలో కూడా ఆమె ఎన్నో సలహాలు, సూచనలు చేశారు.

తాజాగా సరికొత్త ఆలోచనను అమలు చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. టెక్స్ టైల్ స్క్రాప్, పాడైపోయిన కండోమ్స్ తో తయారు చేసిన డిజైనర్ దుస్తులను ధరించారు. ఈ సందర్భంగా ఆమె సవాల్ కూడా విసిరారు.

'పర్యావరణహితమైన ఫ్యాషన్ దే భవిష్యత్తు. స్క్రాప్ ను మీరు ధరించగలరా?' అని ప్రశ్నించారు. టాప్ ను టెక్సై టైల్ స్క్రాప్ తో, స్కర్ట్ ను పాడైపోయిన కండోమ్స్ తో తయారు చేశారని తెలిపింది.