Suddala Ashokteja: సుద్దాల అశోక్ తేజకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స

Operation for Suddala Ashok teja
  • సుద్దాలకు కాలేయ సంబంధిత వ్యాధి  
  • ఆసియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీలో చికిత్స
  • ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడి
ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు శస్త్రచికిత్స జరుగనుండగా, బీ-నెగటివ్ గ్రూప్ రక్తం అవసరం ఉంది. ఆయన అనారోగ్యానికి గురికాగా, ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఆసియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా సుద్దాల కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండగా, కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. సుద్దాలకు రక్తం అవసరం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం సుద్దాల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.
Suddala Ashokteja
Operation
B-Negative

More Telugu News