మా వాడిని వదిలెయ్ అన్నో... వర్మను వేడుకున్న మంచు మనోజ్!

21-05-2020 Thu 11:54
  • వైరల్ అయిన ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్
  • తెగ మెచ్చేసుకుంటున్న వర్మ
  • తాజాగా వైరల్ అవుతున్న మనోజ్ ట్వీట్
Manchu Manoj Asks Varma to Leave NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సిక్స్ ప్యాక్ పిక్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఫోటోపై తనదైన శైలిలో స్పందించాడు. తాను చూసిన శరీరాల్లో మియా మాల్కోవా తరువాత, అంతగా నచ్చిన శరీరం ఇదేనంటూ వర్మ కితాబిచ్చారు. అంతకుముందు ఇంకాస్త ఘాటుగా మరో ట్వీట్ చేశారు.

వర్మ ఎన్టీఆర్ బాడీని తెగ మెచ్చుకుంటూ ఉన్నప్పటికీ, వాడుతున్న భాష మాత్రం కాస్తంత ఎబ్బెట్టుగానే ఉంటోంది. ఇక ఈ ట్వీట్లు చూసిన మంచు మనోజ్ అవాక్కైనట్టున్నాడు. "మా వాడిని వదిలెయ్ అన్నో..." అంటూ ఓ ట్వీట్ పెట్టి, నమస్కార ఎమోజీని తగిలించి రామ్ గోపాల్ వర్మను వేడుకున్నాడు. ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.