చిరంజీవి ఇంటికి చేరుకున్న తలసాని, నాగార్జున, అల్లు అరవింద్, రాజమౌళి!

21-05-2020 Thu 11:45
  • సినీ పెద్దలతో చర్చలు
  • సినిమా పరిశ్రమ కష్టాలు తీర్చే ప్రణాళిక
  • పాల్గొన్న దిల్ రాజు, త్రివిక్రమ్, సి.కల్యాణ్ తదితరులు
Tollywood Crucial Meeting Started in Chiranjeevi House

కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన చిత్ర పరిశ్రమను తిరిగి ఎలా గాడిలో పెట్టాలన్న అంశంపై కీలక చర్చలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా చిరంజీవి ఇంటికి వచ్చారు. వీరిద్దరితో పాటు ఇండస్ట్రీ పెద్దలంతా సినీ పరిశ్రమ ఇబ్బందులపై చర్చిస్తున్నారు.

నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, రాజమౌళి, సి.కల్యాణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి వచ్చారు. ఈ చర్చల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమ, సినిమా థియేటర్లను తిరిగి తెరిచే అంశాలపై కొంత స్పష్టత వస్తుందని సమాచారం.