రానా పేరు కలిసొచ్చేలా టాటూ వేయించుకున్న మిహీకా.. ఫొటో వైరల్

21-05-2020 Thu 11:05
  • టాటూలో రానా పేరులోని మొదటి అక్షరం ‘ఆర్’
  • తన పేరులోని మొదటి అక్షరం ‘ఎం’
  • చేతిపై మిహీకా టాటూ  
mihika tattoo viral

సినీ నటుడు రానా త్వరలో పెళ్లాడబోయే మిహీకా బజాజ్ తన చేతిపై వేయించుకున్న టాటూకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. రానా పేరులోని మొదటి అక్షరం ‘ఆర్’ని, తన పేరులోని మొదటి అక్షరం ‘ఎం’ని తన చేతిపై ఆమె టాటూ వేయించుకుంది.
              
ఆ రెండు అక్షరాల మధ్య లవ్ సింబల్‌ ఉంది. మిహీకా బజాజ్ వేయించుకున్న ఈ టాటూ ఫొటో బాగా వైరల్ అవుతోంది. కాగా, వారిద్దరి కుటుంబాలు తాజాగా హైదరాబాద్‌లో కలుసుకుని నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాలపై చర్చించుకున్నాయి. త్వరలోనే వీటిపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.