Cyclone Amphan: విశాఖలో ముందుకొచ్చిన సముద్రం.. మళ్లీ వెనక్కి వెళ్లింది!
ఎమ్‌ఫాన్ తుపాను కారణంగా ఇటీవల విశాఖలో ముందుకొచ్చిన సముద్రం ఇప్పుడు వెనక్కి వెళ్లింది. ముందుకొచ్చిన సముద్రం కెరటాలతో విరుచుకుపడడంతో తీరప్రాంత వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, తుపాను నిన్న తీరం దాటిన నేపథ్యంలో సముద్రం వెనక్కి వెళ్లింది. దీంతో మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, సముద్రం అల్లకల్లోలంగా మారడంతో లోపలి నుంచి రొయ్యలు తీరానికి కొట్టుకొచ్చాయి. దీంతో వాటిని ఏరుకునేందుకు మత్స్యకారులు పోటీపడ్డారు.