ఇదే నా ఫేవరెట్ వెబ్ సిరీస్: అనసూయ

20-05-2020 Wed 20:19
  • పాతాళ్ లోక్ సిరీస్ ను నిర్మించిన అనుష్క శర్మ
  • చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించిన అనసూయ
  • ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్ అని కితాబు
This is my favourite web series says Anasuya

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన సొంత నిర్మాణ సంస్థ 'క్లీన్ స్లేట్' పతాకంపై 'పాతాళ్ లోక్' పేరుతో వెబ్ సిరీస్ నిర్మించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మే 15న విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ కు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ సిరీస్ పై తెలుగు యాంకర్ అనసూయ ప్రశంసలు కురిపించింది. 'పాతాళ్ లోక్' అద్బుతమైన సిరీస్ అని... ఇప్పటి వరకు తాను చూసిన వాటిలో ఇదే తన ఫేవరెట్ అని తెలిపింది.

నటీనటుల నటన, మేకింగ్ అన్నీ అదిరిపోయాయని అనసూయ ప్రశంసించింది. సిరీస్ పూర్తయిన విధానం కూడా తనకు చాలా నచ్చిందని తెలిపింది. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్ అని తాను అనుకుంటున్నానని చెప్పింది.