గ్యాస్ లీకేజీ ఘటనపై క్షమాపణలు చెప్పిన ఎల్జీ పాలిమర్స్ గ్రూప్ చైర్మన్

20-05-2020 Wed 19:53
  • వారం రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు
  • తనను ఎంతో బాధకు గురిచేశాయన్న గ్వాంగ్ 
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
LG Polymers Chairman apology for Visakha Gas leak incident
విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఎల్జీ పాలిమర్స్ గ్రూప్ చైర్మన్ కూ గ్వాంగ్ మో క్షమాపణలు తెలిపారు. దక్షిణ కొరియాలోని సియోల్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వారం రోజుల వ్యవధిలో విశాఖ, దక్షిణ కొరియాలోని కెమెకల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదాలపై స్పందించారు. ఈ రెండు ప్రమాదాలు తనను ఎంతో బాధించాయని అన్నారు. ఈ  దుర్ఘటనల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదాలకు సంస్థదే పూర్తి బాధ్యత అని పేర్కొన్న ఆయన జరిగిన ఘటనలకు క్షమాపణ కోరారు.