వారికి పరీక్షలొద్దు.. పాస్ చేయండి: యూజీసీకి మహారాష్ట్ర విన్నపం
- డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేం
- విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టలేం
- అందరినీ ప్రమోట్ చేయండి
రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది వరకు విద్యార్థులు ఉన్నారని, ఈ సమయంలో వారిందరికీ పరీక్ష కేంద్రాలు కేటాయించడం, వారి ప్రొటోకాల్ చూసుకోవడం కష్టమైన పని అని, ప్రస్తుత పరిస్థితుల్లో వారి ఆరోగ్యాలను పణంగా పెట్టలేమని అన్నారు. కాబట్టి ఎటువంటి పరీక్షలు లేకుండానే డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని మంత్రి కోరారు.