నాగబాబుపై హైదరాబాదు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

20-05-2020 Wed 19:27
  • గాడ్సేను నిజమైన దేశ భక్తుడు అన్న నాగబాబు
  • వెల్లువెత్తుతున్న విమర్శలు
  • ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
Congress filed complaint on actor Nagababu

సినీ నటుడు నాగబాబు సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. నాధూరాం గాడ్సే ఒక నిజమైన దేశభక్తుడని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే, గాడ్సేను తాను సమర్థించలేదని, ఆయన వెర్షన్ కూడా ప్రజలకు తెలియాలనే తాను ఇలా వ్యాఖ్యానించానని ఆయన చెప్పినప్పటికీ... విమర్శకుల ఆగ్రహం తగ్గలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాగబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ నేత మానవతారాయ్ ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని కించపరిచేలా వ్యాఖ్యానించిన నాగబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.