Junior NTR: మీ రుణాన్ని ఏమిచ్చి తీర్చుకోగలను?: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్

Junior NTRs heart touching tweet for his fans
  • మీ అభిమానం వెలకట్టలేనిదని వ్యాఖ్య
  • ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని కాగలను? 
  • అభిమానులను ఉద్దేశించి తారక్ ట్వీట్
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తన అభిమానులకు తారక్ ధన్యవాదాలు తెలిపాడు. ఫ్యాన్స్ ను ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేశాడు.

'మీరు నా మీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా నిలుస్తున్న మీరే నా బలం. మీ రుణాన్ని ఏమిచ్చి తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని కాగలను? చివరిదాకా మీకు తోడుగా ఉండటం తప్ప' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తన సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని తారక్ అన్నాడు. అందరి ట్వీట్లు చదవడం గొప్పగా అనిపించిందని... మీరందరూ ఈరోజును మరింత స్పెషల్ గా మార్చారని చెప్పాడు.
Junior NTR
Tollywood
Birthday

More Telugu News