ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించనున్న కేంద్ర మంత్రి 

20-05-2020 Wed 16:05
  • డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎంపిక
  • ఎల్లుండి బాధ్యతలను స్వీకరించనున్న హర్షవర్ధన్
  • మూడేళ్లపాటు పదవీకాలం
Union minister Harsha Vardhan to take charge as WHO Executive Board Chairman

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. 194 సభ్య దేశాలున్న డబ్ల్యూహెచ్ఓ నిన్న సమావేశమైంది. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ను ఎన్నుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న జపాన్ కు చెందిన డాక్టర్ హిరోకి  నకటాని స్థానంలో హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

ఈ నెల 22న జరగనున్న బోర్డు మీటింగ్ లో హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే బోర్డు ఛైర్మన్ అనేది పూర్తి కాలం ఉండే బాధ్యత కాదు. కేవలం బోర్డు సమావేశాలకు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. బోర్టు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవీకాలం మూడేళ్లుగా ఉంటుంది. ఏడాదికి రెండు సార్లు బోర్డు సమావేశాలు జరుగుతాయి.