గత వారం రోజుల్లో గూగుల్లో విపరీతంగా వెతికిన అంశాలు ఇవే!

20-05-2020 Wed 15:37
  • ఫోన్ ద్వారా ఆత్మీయులను కలిసే అవకాశాలను ఎక్కువగా వెతికిన జనాలు
  • హౌ టు స్టే కనెక్ట్ అంశం గురించి శోధన
  • శుభాకాంక్షలు చెప్పే మార్గాల అన్వేషణ
These are most searched things in this week in google

లాక్ డౌన్ నేపథ్యంలో జనాలంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఎంతో మంది తమవారికి దూరంగా ఉంటున్నారు. అందుకే తమ ఆత్మీయులతో స్మార్ట్ ఫోన్ ద్వారా వారిని వర్చువల్ గా కలిసే అవకాశాలపై జనాలు ఎక్కువగా వెతికారు. గత వారం రోజుల్లో నెట్ లో జనాలు ఎక్కువగా వెతికిన అంశాలను గూగుల్ విడుదల చేసింది.

లాక్ డౌన్ ప్రారంభంలో ఫిట్ నెస్, ఇంటికి సంబంధించిన పనులకు సంబంధించిన అంశాలను ఎక్కువగా సెర్చ్ చేసిన జనాలు... ఇప్పుడు 'హౌ టు స్టే కనెక్ట్' అనే అంశాన్ని ఎక్కువగా శోధించారట. అంతేకాదు సన్నిహితులకు శుభాకాంక్షలు చెప్పడానికి... ప్రేమ, ఆప్యాయతలను వెల్లడించడానికి గల మార్గాలను వెతికారని గూగుల్ తెలిపింది.