Maharashtra: నిచ్చెన సాయంతో బావిలోంచి బయట పడ్డ ఎలుగుబంట్లు.. వీడియో ఇదిగో

rescued two bears that had fallen in wells
  • మహారాష్ట్రలో ఘటన
  • బావిలో పడ్డ ఎలుగులు
  • విషయాన్ని గుర్తించిన అధికారులు
  • బావిలోకి నిచ్చెన వేసిన సిబ్బంది
బావిలో పడ్డ ఎలుగుబంట్లు చాలా తెలివిగా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్న ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బావిలో పడ్డ రెండు ఎలుగు బంట్లు నీటిలోనే కొట్టుకుంటున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన గోండియాలో సాలెకాసా రేంజ్‌కు చెందిన అధికారులు వాటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా బావిలోకి నిచ్చెన వేశారు.

దీంతో ఆ ఎలుగుబంట్లు నిచ్చెనను పట్టుకుని మనుషుల్లా ఎక్కుతూ బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఎలుగు బంట్లు బయటపడిన తీరును ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Maharashtra
bear

More Telugu News