సూరత్ లో ప్రారంభమైన వజ్రాల పరిశ్రమ

20-05-2020 Wed 13:38
  • గత రెండు నెలలుగా మూతపడిన వజ్రాల పరిశ్రమ
  • కొద్ది మంది కార్మికులతో నేడు తెరుచుకున్న సూరత్ వజ్ర పరిశ్రమ
  • లాక్ డౌన్ వల్ల పెద్ద నష్టం సంభవించిందన్న వ్యాపారులు
Surat diamond industry reopened toady

ప్రపంచ వజ్రాల మార్కెట్ లో సూరత్ కు ప్రముఖ స్థానం ఉంది. లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా మూతపడిన సూరత్ వజ్రాల పరిశ్రమ ఈరోజు తెరుచుకుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే... కొద్ది మంది కార్మికులతోనే పనులు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా వజ్రాల వ్యాపారులు మాట్లాడుతూ, సూరత్ లో పరిశ్రమ ప్రారంభమైనప్పటికీ... ముంబైలో ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు. లాక్ డౌన్ వల్ల ఎగుమతులకు పెద్ద ఆటంకం కలిగిందని... చాలా నష్టం సంభవించిందని అన్నారు. తక్కువ మంది సిబ్బందితోనే పనులను ప్రారంభించామని... వారితో ఎక్కువ పని గంటలు చేయించి, అధిక జీతాన్ని చెల్లిస్తామని చెప్పారు.