రానా నిశ్చితార్థ వార్తలను ఖండించిన నిర్మాత సురేశ్ బాబు

20-05-2020 Wed 12:06
  • స్పష్టతనిచ్చిన సురేశ్ బాబు
  • ఇరు కుటుంబాలు మర్యాదపూర్వకంగానే కలుస్తున్నాయి
  • నిశ్చితార్థం, పెళ్లి తేదీలను తర్వాత నిర్ణయిస్తాం
suresh about rana engagement

సినీనటుడు రానా, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం ఈ రోజేనంటూ వచ్చిన వార్తలపై రానా తండ్రి, నిర్మాత సురేశ్ బాబు స్పందించి స్పష్టతనిచ్చారు. ఈ రోజు సాయంత్రం ఇరు కుటుంబాలు మర్యాదపూర్వకంగానే కలుసుకుంటున్నాయని వివరించారు. నిశ్చితార్థంతో పాటు పెళ్లి తేదీలపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

కాగా, రామానాయుడు స్టూడియోలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వారిద్దరి నిశ్చితార్ధ వేడుక జ‌ర‌గ‌నుందని వార్తలు వచ్చాయి. పెళ్లి కూతురు మిహీకా బజాజ్ కూడా హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా. చెల్సియా వర్సిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొంది,  ‘డ్యూ డ్రాప్ డిజైన్’ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు.