ఎమ్‌ఫాన్ ఎఫెక్ట్: ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు శ్రామిక్ రైళ్లు రద్దు

20-05-2020 Wed 10:07
  • ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు, నేల కూలిన వృక్షాలు
  • విద్యుత్ సరఫరాలో అంతరాయం
  • మహారాష్ట్ర నుంచి వెళ్లాల్సిన రైళ్లు రద్దు
Cyclone Amphan effect Railway cancels shramik trains

సూపర్ సైక్లోన్‌గా మారిన ఎమ్‌ఫాన్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ నేడు రద్దు చేసింది. నేటి సాయంత్రం పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తుపాను తీరం దాటనుండగా.. దాని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలులు ఉద్ధృతంగా వీస్తున్నాయి.

ఫలితంగా చెట్లు కూలిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో మరోమార్గం లేక మహారాష్ట్ర నుంచి ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. చంద్‌బలీ, భువనేశ్వర్, బాలాసోర్‌తోపాటు పారదీప్‌లలో గాలులు ప్రచండ వేగంతో వీస్తున్నాయి.