వందేభారత్ మిషన్-2: లండన్ నుంచి గన్నవరం చేరుకున్న 143 మంది

20-05-2020 Wed 08:55
  • విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు
  • బస్సుల ద్వారా ఆయా జిల్లాలకు తరలింపు
  • జిల్లా కేంద్రాల్లో పెయిడ్, ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు
143 NRIs Landed in Gannavaram Airport

వందేభారత్ మిషన్-2లో భాగంగా ఈ ఉదయం 143 మంది ప్రవాసీయులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులోనే వీరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు అనంతరం క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు.

వివిధ జిల్లాలకు చెందిన వారిని ఆర్టీసీ బస్సుల ద్వారా ఆ జిల్లా కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ వారి స్తోమతను బట్టి పెయిడ్, ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు. వందే భారత్ మిషన్ తొలి విడతలో వివిధ దేశాల నుంచి భారతీయులను తరలించిన కేంద్రం.. శనివారం ప్రారంభమైన రెండో విడతలో భాగంగా మరిన్ని దేశాల నుంచి భారతీయులను తరలిస్తోంది. ఈ నెల 22 వరకు రెండో దశ కొనసాగనుంది. ఇందుకోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఎయిరిండియా విమానాలు తరలివెళ్లాయి.