Shramik Rail: శ్రామిక్ రైళ్ల విషయంలో మార్గదర్శకాలను సవరించిన కేంద్రం

States permission not necessary for Shramik trains
  • ఇక గమ్యస్థాన రాష్ట్రం అనుమతి అవసరం లేదు
  • అవసరమైన వివరాలను రైల్వేకు అందిస్తే సరిపోతుంది
  • హోంశాఖ అనుమతితో శ్రామిక్ రైళ్లను నడుపుతుంది
లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వసల కార్మికులను తరలించేందుకు నడుపుతున్న శ్రామిక్ రైళ్ల విషయంలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలను సవరించింది. తమ రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు తరలించాలంటే ఆయా ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరినట్టుగా అనుమతి పత్రాన్ని రైల్వేకు అందిస్తే రైల్వే శాఖ శ్రామిక్ రైలును ఏర్పాటు చేసేది.

అయితే, ఇప్పుడు ఇలాంటి అంగీకారాలేమీ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్తగా ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొటోకాల్‌) జారీ చేసింది. దాని ప్రకారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలోని వలస కార్మికులను పంపడానికి అవసరమైన వివరాలను రైల్వే శాఖకు అందిస్తే సరిపోతుంది. అనంతరం కేంద్ర హోంశాఖ అనుమతితో రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను నడుపుతుంది.
Shramik Rail
migrant workers
Lockdown

More Telugu News