కొడుకు కోసం సచిన్ సరికొత్త అవతారం

19-05-2020 Tue 20:14
  • తనయుడికి హెయిర్ కట్ చేసిన సచిన్
  • ఇన్ స్టాగ్రామ్ లో వీడియో
  • పిల్లల కోసం ఏదైనా చేయకతప్పదని వ్యాఖ్యలు
Sachin turns hairstylist for his son

కరోనా ధాటికి యావత్ ప్రపంచం ఇంటికే పరిమితమైన పరిస్థితుల్లో టీమిండియా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ కోసం బార్బర్ అవతారం ఎత్తారు. తనయుడికి హెయిర్ కట్ చేసిన సచిన్... ఓ తండ్రి పిల్లల కోసం ఏదైనా చేయక తప్పదు అంటూ ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. పిల్లలతో కలిసి ఆడుకోవడం, జిమ్ లో కసరత్తులు చేయడం కూడా ఈ కోవలోకే వస్తాయని, హెయిర్ కట్ చేయడం కూడా ఇలాంటిదేనని వ్యాఖ్యానించారు. హెయిర్ కట్ ఎలాగున్నా, నువ్వెప్పటికీ అందంగానే ఉంటావు అంటూ తనయుడికి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక హోమ్ సెలూన్ లో తనకు అసిస్టెంట్ గా వ్యవహరించింది అంటూ కుమార్తె సారా టెండూల్కర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.