మియా మాల్కోవా తర్వాత నేను చూసిన బెస్ట్ బాడీ ఇదే: రామ్ గోపాల్ వర్మ

19-05-2020 Tue 20:00
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తారక్ ఫొటో
  • 'వావ్' అంటూ ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ
  • మియా మాల్కోవాతో మరో చిత్రాన్ని నిర్మిస్తున్న ఆర్జీవీ
Junior NTRs is the bestest body I saw since Mia Malkova

బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ తీసిన జూనియర్ ఎన్టీఆర్ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిమిషాల వ్యవధిలోనే భారీ ఎత్తున క్లిక్స్ ను సొంతం చేసుకుంటోంది. సిక్స్ ప్యాక్ తో కండలు తిరిగిన తారక్ ఫొటోను చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ఈ పిక్ పై సినీ ప్రముఖులు కూడా స్పందించడం ప్రారంభమైంది. ఇప్పటికే బండ్ల గణేశ్ తారక్ ను ఆకాశానికి ఎత్తేశారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. 'వావ్... మియా మాల్కోవా తర్వాత నేను చూసిన బెస్ట్ బాడీ ఇదే' అంటూ ట్వీట్ చేశారు. మియా మాల్కోవాతో వర్మ రెండో చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.