చచ్చిన జంతువును సింహం ముట్టదు: జూనియర్ ఎన్టీఆర్ పై బండ్ల గణేశ్ ట్వీట్లు

19-05-2020 Tue 19:40
  • ఎన్టీఆర్ ఫొటోను షూట్ చేసిన డబ్బూ రత్నానీ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్
  • వామ్మో.. అదిరిపోయింది అన్న బండ్ల గణేశ్
Bandla Ganesh praises Junior NTR

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ పై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో తారక్ గురించి తనదైన శైలిలో వరుస ట్వీట్లు చేశారు.

'వామ్మో... సూపర్. అదిరిపోయింది. బతకాలంటే బాద్షా కిందుండాలి. చావాలంటే బాద్షా ముందుండాలి. భయపడేవాడు బానిస. భయపెట్టే వాడు బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. అయ్య డిసైడ్ అయ్యాడు. అందుకే వార్ వన్ సైడ్ చేశాడు. చచ్చిన జంతువును సింహం ముట్టదు. భయపడే మనిషిని బాద్షా చంపడు' అంటూ సినిమాలోని డైలాగులను వరుసగా పోస్ట్ చేశారు.