కండలు తిరిగిన శరీరంతో ఎన్టీఆర్ ఫొటో!

19-05-2020 Tue 19:01
  • ఎన్టీఆర్ ఫొటో తీసిన బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నాని
  • ఫుల్ జోష్ లో తారక్ ఫ్యాన్స్
  • 'ఆర్ఆర్ఆర్' ప్రోమో విడుదల కాకపోవడంతో నిరాశలో అభిమానులు
Six pack pic of Junior NTR shot by Dabboo Ratnani

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 'ఆర్ఆర్ఆర్' చిత్రం నుంచి కొమురం భీమ్ పాత్రకు సంబంధించి వీడియో ప్రోమో వస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఎలాంటి వీడియో కానీ, ఫస్ట్ లుక్ కానీ విడుదల చేయడం లేదని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు. అయితే అభిమానులు ఎవరూ నిరాశ చెందవద్దని... ఈ సినిమా సంచలనం సృష్టించబోతోందంటూ వారిలో నూతనోత్సాహాన్ని ఎన్టీఆర్ నింపాడు.

మరోవైపు, అభిమానుల కోరికను ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నాని తీర్చారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసిన ఎన్టీఆర్ పిక్ విడుదలైంది. ఈ ఫొటోలో కండలు తిరిగిన శరీరంతో ఎన్టీఆర్ మ్యాన్లీగా కనిపిస్తున్నాడు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటోను చూసి తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.