నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో కరోనా కలకలం

19-05-2020 Tue 17:45
  • బోనీ వద్ద పనిచేసే యువకుడికి కరోనా
  • క్వారంటైన్ కు తరలించనున్న అధికారులు
  • తమ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగానే ఉన్నారన్న బోనీ
Employ in Bony Kapoor house tested corona positive

ముంబయిలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లోనూ కరోనా కలకలం రేగింది. బోనీ కపూర్ ఇంట్లో పనిచేసే యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. 23 ఏళ్ల చరణ్ సాహు కొన్నాళ్లుగా బోనీ కపూర్ వద్ద పనిచేస్తున్నాడు. శనివారం చరణ్ సాహు అనారోగ్యం పాలవడంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. సాహును ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించనున్నారు.

దీనిపై బోనీ కపూర్ స్పందిస్తూ, చరణ్ సాహు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తమ కుటుంబ సభ్యులెవరికీ కరోనా సోకలేదని, ఇతర సిబ్బంది కూడా ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి తామెవరూ బయటికి వెళ్లలేదని వివరించారు.