జూనియర్ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన డేవిడ్ వార్నర్

19-05-2020 Tue 16:00
  • రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు
  • ఎన్టీఆర్ కు విషెస్ తెలుపగలరా అంటూ వార్నర్ ను కోరిన ఫ్యాన్
  • సానుకూలంగా స్పందించిన వార్నర్
David Warner wishes Jr NTR on his birthday

కరోనా కారణంగా యావత్ క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయినా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాత్రం టిక్ టాక్ వీడియోలతో అభిమానులను విశేషంగా అలరిస్తున్నాడు. వరుసగా తెలుగు హిట్ సాంగ్స్ కు టిక్ టాక్ వీడియోలు చేస్తూ టాలీవుడ్ ప్రముఖులను సైతం ఆకట్టుకుంటున్నాడు.

 తాజాగా, వార్నర్ ఓ అభిమాని కోరికపై జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. "డేవిడ్ భాయ్, రేపు నా ఫేవరెట్ హీరో తారక్ పుట్టినరోజు. అతనికి మీరు విషెస్ తెలుపగలరా?" అంటూ ఓ అభిమాని ట్విట్టర్ లో కోరగా, వార్నర్ సానుకూలంగా స్పందించాడు. "హ్యాపీ బర్త్ డే బడ్డీ" అంటూ ట్వీట్ చేసి ఆ అభిమానిని సంతోష సాగరంలో ముంచెత్తాడు.