Satya Nadella: వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సంబంధాలు దెబ్బతింటాయి: సత్య నాదెళ్ల

  • ఉద్యోగుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది
  • ఉద్యోగులు ఇబ్బంది పడతారు
  • శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మంచిది కాదు
Permanent work from home not good says Satya Nadella

కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే, అన్ని దేశాల్లో లాక్ డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తున్నారు. దీంతో, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం ప్రారంభించారు.

మరోవైపు, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఒక ప్రకటన చేసింది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. దీంతో అన్ని  కంపెనీలు దాదాపు ఇదే బాట పడతాయని భావించారు. అయితే, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల దీనికి విరుద్ధంగా స్పందించారు.

శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం మంచిది కాదని సత్య నాదెళ్ల అన్నారు. ఉద్యోగుల మానసిక స్థితిపై కూడా ఇది ప్రభావం చూపుతుందని చెప్పారు. పరస్పర సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. వీడియో కాల్స్ ఎప్పటికీ వ్యక్తిగత సమావేశాలను భర్తీ చేయలేవని చెప్పారు.

ఒక వ్యక్తి పక్కనే ఉంటే... ఎప్పుడైనా మాట్లాడుకునే అవకాశం ఉంటుందని అన్నారు. శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడతారని... దీని కోసం కంపెనీలు కూడా నిబంధనలను మార్చుకోవాల్సి వస్తుందని చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు అభిప్రాయపడ్డారు.

More Telugu News