సీఐడీ నోటీసులపై రంగనాయకమ్మ స్పందన

19-05-2020 Tue 14:33
  • వైసీపీ వ్యతరేక పోస్టులు పెట్టిన వృద్ధురాలు
  • కేసు నమోదు చేసిన సీఐడీ
  • ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదన్న రంగనాయకమ్మ
Ranganayakamma response on anti YSRCP social media postings

ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనే ఆరోపణలతో గుంటూరు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన 66 ఏళ్ల వృద్ధురాలు రంగనాయకమ్మపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని తాను ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని చెప్పారు. తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు న్యాయం జరగాలన్నదే తన కోరిక అని అన్నారు.

రంగనాయకమ్మపై 41-ఏ కింద సీఐడీ నోటీసులు అందజేసింది. నేరం రుజువైతే ఆమెకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు.