Liquor Sales: ఏపీలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో విచారణ వచ్చే వారానికి వాయిదా

AP High Court hears petitions against liquor sales
  • లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీలో మద్యం అమ్మకాలు
  • మద్యం అమ్మకాలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు
  • భౌతికదూరం పాటించడం లేదంటూ పిటిషనర్ల ఆరోపణ
లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు జరుపుతున్నారంటూ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలంటూ 3 పిటిషన్లు దాఖలయ్యాయి. మద్యం అమ్మకాల సమయంలో భౌతికదూరం పాటించడం లేదంటూ పిటిషనర్లు ఆరోపించారు. నిబంధనలు పాటించకపోతే కరోనా మరింత వ్యాపిస్తుందని తెలిపారు.

అటు, ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తూ, నిబంధనలకు అనుగుణంగానే వైన్ షాపులకు అనుమతి ఇచ్చామని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు... మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Liquor Sales
AP High Court
Andhra Pradesh
Lockdown
Corona Virus

More Telugu News