China: కరోనాకు ఔషధాన్ని అభివృద్ధి చేశాం: చైనా పరిశోధకుల ప్రకటన

  • ఇప్పటికే జంతువులపై  చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయి
  • ఈ మందును వాడినట్లయితే కరోనా రోగులు త్వరగా కోలుకుంటారు
  • వారి రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది
  • దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపాల్సి ఉంది
china develops drug for corona

కరోనాను అరికట్టడానికి తాము ఔషధాన్ని అభివృద్ధి చేసినట్లు చైనాలోని పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. ఇప్పటికే జంతువులపై  చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పారు. తాము అభివృద్ధి చేసిన ఈ మందును వాడినట్లయితే కరోనా రోగులకు త్వరగా నయం అవుతుందని, వారి రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుందని చెప్పారు.

ఇప్పటికే ఈ ఔషధ ప్రయోగాల్లో భాగంగా రోగం బారిన పడిన ఎలుకలకు న్యూట్రలైజింగ్‌ యాంటీ బాడీస్‌ ఎక్కించామని, ఐదు రోజుల తర్వాత వాటిలో వైరస్‌ ప్రభావం 2500 యూనిట్లకు పడిపోయిందని చెప్పారు. ఈ డ్రగ్‌ను కరోనా చికిత్స విధానంలో ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు చెప్పారు.

కరోనా నుంచి కోలుకున్న 60 మంది రోగుల నుంచి యాంటీబాడీలు సేకరించామని, వాటి ఆధారంగానే తాము ఔషధాన్ని అభివృద్ధి చేశామని చైనా పరిశోధకులు ప్రకటించారు. దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరపాల్సి ఉందని, వచ్చే ఏడాది దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కరోనాకు న్యూట్రలైజ్‌డ్‌ యాంటీబాడీస్‌ ప్రత్యేకమైన డ్రగ్‌లా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెప్పారు.

More Telugu News