జగన్ అమలు చేస్తున్నవి ప్రజావ్యతిరేక విధానాలు: పురందేశ్వరి

19-05-2020 Tue 13:20
  • జగన్ సర్కారుపై ధ్వజమెత్తిన పురందేశ్వరి
  • విద్యుత్ టారిఫ్ పెంచారంటూ విమర్శలు
  • దేవాదాయ, ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు
BJP leader Purandeswari protests against CM Jagan policies

బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. విద్యుత్ స్లాబ్ రేటును 75 యూనిట్లకు తగ్గించడం, విద్యుత్ టారిఫ్ ను పెంచడం వంటి నిర్ణయాలతో పేదలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని అన్నారు. ఇదేకాకుండా, ఆదాయం కోసం దేవాదాయ భూములను, ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని ఆరోపించారు. వేలమంది బీజేపీ కార్యకర్తలు వైసీపీకి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారంటూ పురందేశ్వరి ట్వీట్ చేశారు.