చిన్నప్పుడు తనను మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఫొటోను పోస్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో

19-05-2020 Tue 13:16
  • 1991లో విడుదలైన కలికాలం సినిమా
  • 100 రోజుల వేడుకకు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
  • సాయికుమార్ తరఫున ఆదికి షీల్డు
aadi post on instagram

చంద్ర మోహన్, జయసుధ, సాయి కుమార్, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించిన 'కలికాలం' సినిమా 1991లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టింది.  ఆ సినిమా 100 రోజుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందుకు మెగాస్టార్ చేతుల మీదుగా సాయికుమార్‌కు ఇవ్వాల్సిన షీల్డ్‌ను ఆయన కొడుకు ఆదికి  అందించారు.

ఆ సమయంలో ఆదిని చిరు ఎత్తుకున్నారు. ఈ  ఫొటోను ఆది తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో షేర్ చేశాడు. 'డ్యాడ్ తరఫున కలికాలం సినిమాకు నేను అవార్డు అందుకున్నాను' అని పేర్కొన్నాడు.  కాగా, ఈ సినిమాకు  దర్శకుడు ముత్యాల సుబ్బయ్య కళావాహిని అవార్డు కూడా అందుకున్నారు.