Telangana: తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు పచ్చజెండా.. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి

  • జూన్‌ 8 తర్వాత నిర్వహించుకోవచ్చు
  • కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలి
  • భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలి
  • ఏపీలో జులైలో పదో తరగతి పరీక్షలు
high court on telangana tenth exams

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో వాయిదా పడ్డ తెలంగాణ పదో తరగతి‌ పరీక్షలను మళ్లీ నిర్వహించడానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరీక్షలను జూన్‌ 8 తర్వాత నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండాలని చెప్పింది.

భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. అయితే, జూన్‌ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కారుని  హైకోర్టు ఆదేశించింది. ఆ సమయంలోనూ కేసుల తీవ్రత పెరుగుతున్నట్లయితే, అప్పటి పరిస్థితులను బట్టి మరో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

కాగా, తెలంగాణలో లాక్‌డౌన్‌కి ముందు పదో తరగతి పరీక్షలు మూడు జరగగా, మరో ఎనిమిది మిగిలి ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పరీక్షల కేంద్రాల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏపీలో జులైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. కరోనా తీవ్రతను బట్టి షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది.

More Telugu News