Sanghavi: తన కూతురుతో కలసి వున్న ఫొటోను పోస్ట్ చేసిన సినీ నటి సంఘవి!

Actress Sanghavi delivers baby girl
  • 39 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సంఘవి
  • పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన వైనం
  • 42 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన కన్నడ భామ
1990లో హీరోయిన్ గా మంచి గుర్తింపును సొంత చేసుకున్న సంఘవి... సినిమాలకు దూరమై చాలా కాలం అవుతోంది. చివరగా 'ఆంధ్రావాల' సినిమాలో ఓ సపోర్టింగ్ రోల్ లో కనిపించింది. మధ్యలో ఒకటి, రెండు సినిమాలలో నటించినా... ఆ తర్వాత ఆఫర్లు రాలేదు. 2016లో 39 ఏళ్ల వయసులో ఓ వ్యాపారవేత్తను సంఘవి పెళ్లాడింది. కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె ఇంటికే పరిమితమైంది. పబ్లిక్ లో ఎక్కడా కనిపించింది కూడా లేదు.

లేటుగా పెళ్లి చేసుకున్న సంఘవి 42 ఏళ్ల వయసులో ఇటీవల తల్లి అయింది. తాజాగా తన కూతురుతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చాలా కాలం తర్వాత సంఘవి కనిపించడం, పైగా తన కూతురుని కూడా చూపించడంతో... ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Sanghavi
Tollywood
Mother
Baby Girl

More Telugu News