Hyderabad: అత్తింటి వేధింపులు భరించలేక.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

  • ఉద్యోగం మానేసి ఖాళీగా ఉంటున్న భర్త వేధింపులు
  • మరోపక్క భర్త, అత్తమామల సూటిపోటి మాటలు 
  • ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
woman software engineer suicide in Hyderabad

అత్తింటి ఆరళ్లు భరించలేని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కల్యాణ్‌పురి టీచర్స్ కాలనీకి చెందిన సతీశ్ 8 ఏళ్ల క్రితం శ్రీలత (33)ను వివాహం చేసుకున్నాడు. ఉప్పల్‌లోనే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీలతకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. ప్రైవేటు ఉద్యోగి అయిన సతీశ్ ఉద్యోగం మానేసి గత కొంతకాలంగా ఖాళీగా ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో భార్యను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. భర్తతోపాటు అత్తమామలు కూడా వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన శ్రీలత నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందన్న శ్రీలత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News