తిరుమల శ్రీవారికి ఆన్‌లైన్‌ ద్వారా కానుకల వెల్లువ!

19-05-2020 Tue 08:33
  • టీటీడీ వెబ్‌సైట్, గోవిందం యాప్ ద్వారా కానుకలు
  • గతేడాది ఏప్రిల్‌లో రూ. 90 లక్షల కానుకలు
  • కరోనా సంక్షోభంలోనూ అంతే మొత్తంలో ఆన్‌లైన్ హుండీ ఆదాయం
Tirumala Online Hundi Income Same As Last April

కరోనా మహమ్మారి కారణంగా తిరుమల వేంకటేశ్వరుడి దర్శన భాగ్యానికి భక్తులు నోచుకోకపోతున్నా కానుకలు సమర్పించడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆన్‌లైన్ ద్వారా, గోవిందం యాప్ ద్వారా తోచినంతగా హుండీకి సమర్పించుకుంటున్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఆన్‌లైన్ హుండీకి రూ. 90 లక్షల కానుకలు జమకాగా, కరోనా వైరస్ సంక్షోభంలో ఉన్నప్పటికీ గత నెలలో కూడా అంతే మొత్తం కానుకలు రావడం విశేషమని అధికారులు చెబుతున్నారు. కాగా, కరోనా వైరస్‌కు జాగ్రత్తలు తీసుకుంటూనే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని టీటీడీ యోచిస్తోంది.