తొలిసారిగా షర్ట్ లేకుండా మహేశ్ బాబు... పిక్ పెట్టిన నమ్రత!

19-05-2020 Tue 08:12
  • స్విమ్మింగ్ పూల్ లో టాలీవుడ్ ప్రిన్స్
  • సితారతో కలిసి ఆడుతున్న మహేశ్
  • పిక్ ను పోస్ట్ చేసిన నమ్రత
Mahesh Shirtless Pic Posted by Namratha

రీల్ లైఫ్ లో కాకుండా, రియల్ లైఫ్ లో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చొక్కా లేకుండా ఎప్పుడూ కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు కనిపిస్తున్నాడు. నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ లో తొలిసారిగా తన భర్త షర్ట్ లెస్ ఫోటోను పోస్ట్ చేశారు. ఇందులో తన కుమార్తె సితారతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో మహేశ్ కనిపిస్తున్నారు. ఈ పిక్ ను నమ్రత ఇలా పోస్ట్ చేయగానే అలా వైరల్ అయిపోయింది. లాక్ డౌన్ కారణంగా ఫ్యామిలీతో గడుపుతున్న మహేశ్, ఈ సమయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యారు.