నెల్లూరులో కరోనాపై విజయం సాధించిన 9 నెలల చిన్నారి!

19-05-2020 Tue 07:18
  • కోటమిట్ట ప్రాంతంలో కరోనా పరీక్షలు
  • రెండు వారాల చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారి
  • పూర్తి ఆరోగ్యంగా తల్లి చెంతకు
9 month baby win over coronavirus

నెల్లూరులో అద్భుతం జరిగింది. కోవిడ్ మహమ్మారి బారినపడిన 9 నెలల చిన్నారి కోలుకుంది. రెండు వారాల చికిత్స తర్వాత కోలుకున్న పాప ప్రస్తుతం తల్లిదండ్రుల చెంతకు చేరింది. నగరంలోని కోటమిట్ట ప్రాంతంలో ప్రభుత్వం ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానికంగా నివసించే ఓ కుటుంబంలోని 9 నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

దీంతో వెంటనే ఆ చిన్నారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. రెండు వారాల తర్వాత ఆమెకు మరోమారు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగటివ్ అని తేలడంతో నిన్న డిశ్చార్జ్ చేశారు. రెండు వారాల తర్వాత తమ చెంతకు చేరిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, చిన్నారికి కరోనా వైరస్ ఎవరి ద్వారా సంక్రమించిందన్న వివరాలు తెలియరాలేదు.