bahrain: బహ్రెయిన్‌లో 125 మంది భారతీయులకు క్షమాభిక్ష.. భారత్‌కు చేరిక!

  • కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న భారతీయులు
  • అక్కడి నుంచి నావికాదళ క్వారంటైన్ కేంద్రానికి తరలింపు
  • 14 రోజుల తర్వాత సొంత రాష్ట్రాలకు
125 prisioners reached kochi from Behrain

వివిధ నేరాలకు పాల్పడి బహ్రెయిన్‌లో శిక్ష అనుభవిస్తున్న 125 మందికిపైగా భారతీయులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. విడుదలైన వారంతా ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం వారందరినీ నావికాదళ క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. వీరిని కొచ్చికి తీసుకువచ్చిన విమానంలోనే ఇక్కడ వున్న బహ్రెయిన్‌కు చెందిన 60 మందిని తిరిగి పంపించినట్టు పేర్కొన్నారు.

కొచ్చికి చేరుకున్న వారంతా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 14 రోజులపాటు మిలటరీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని అధికారులు తెలిపారు. క్వారంటైన్ ముగిసిన తర్వాత వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపిస్తామన్నారు. మరోవైపు, కరోనా లాక్‌డౌన్ కారణంగా దుబాయ్, అబుధాబిలలో చిక్కుకుపోయిన 347 మంది భారతీయులు ఆదివారం రెండు విమానాల్లో ఎర్నాకుళం చేరుకున్నారు. వీరిని కూడా అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

More Telugu News