తెలంగాణలో నేడు 41 మందికి కరోనా పాజిటివ్

18-05-2020 Mon 22:10
  • జీహెచ్ఎంసీ పరిధిలో 26 కేసులు
  • ఇవాళ కోలుకుని 10 మంది డిశ్చార్జి
  • 25 జిల్లాల్లో 14 రోజులుగా ఒక్క కేసు కూడా లేని వైనం
Telangana suffers corona as new cases raised

తెలంగాణలో ఇవాళ కూడా పదుల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూశాయి. జీహెచ్ఎంసీలో 26, వలస కార్మికుల్లో 12, మేడ్చెల్ లో 3 కేసులతో కలిపి మొత్తం 41 కొత్త కేసులు వెల్లడయ్యాయి. దాంతో ఓవరాల్ గా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1592కి పెరిగింది.

ఇక ఇవాళ 10 మంది డిశ్చార్జి అయ్యారు. తద్వారా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1002కి చేరింది. ప్రస్తుతం 556 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మరణాల సంఖ్య 34 కాగా, కొత్త మరణాలేవీ చోటు చేసుకోలేదు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో 25 జిల్లాల్లో గడచిన 14 రోజులుగా కొత్త కేసులేవీ వెలుగు చూడలేదు.