AIIMS: ఢిల్లీ ఎయిమ్స్ లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా

  • ఇప్పటివరకు 92 మంది ఎయిమ్స్ సిబ్బందికి కరోనా
  • డాక్టర్లు, నర్సులు, గార్డులు, పారిశుద్ధ్య సిబ్బందికి కరోనా పాజిటివ్
  • ప్రొఫెసర్ కు కరోనా పాజిటివ్ రావడంతో సిబ్బందికి క్వారంటైన్
Corona spreads in between Delhi AIIMS staff

కరోనా మహమ్మారిపై పోరులో ముందు నిలిచి పోరాడుతున్న వైద్య సిబ్బంది సైతం వైరస్ బారినపడుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో 92 మందికి కరోనా నిర్ధారణ అయింది. గత రెండు నెలలుగా ఎయిమ్స్ లో కరోనా చికిత్సలు చేస్తున్నారు. అనేకమంది కరోనా రోగులను ఎయిమ్స్ కు తరలిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇక్కడి వైద్య, ఆరోగ్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. కరోనా సోకిన వారిలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. అంతేకాదు, ఎయిమ్స్ బోధన విభాగంలో ఓ ప్రొఫెసర్ కు కరోనా నిర్ధారణ కావడంతో 10 మంది సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచాల్సి వచ్చింది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందే కరోనా బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

More Telugu News